పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడుపై ధ్వజమెత్తారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదరికానికి కులం ఉండదని… పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావని… అయినా వారికి తోడుగా ఉండాలనే వీటిని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల…
76
previous post