వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్..

Advertisements

<p>జగన్‌ మాజీ సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు&period; బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు&period; సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్‌ కేసులో శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది&period; ముందస్తు బెయిల్‌ మంజూరుకు నిరాకరించింది న్యాయస్థానం&period; మధ్యంతర ఉపశమనం సైతం కల్పించలేమని తేల్చి చెప్పింది&period; దీంతో శ్రీహరిని అరెస్ట్‌ చేశారు కుప్పం పోలీసులు&period;<&sol;p>&NewLine;<p>చంద్రబాబుపై సోషల్‌ మీడియాల్లో అనుచిత వ్యాఖ్యలు&comma; అభ్యంతరకర చిత్రాలను పోస్టు చేశారని&period;&period; ఆయన చేతిలో కత్తిపెట్టి చిత్రాలను సృష్టించి&comma; వాటిని వైరల్‌ చేశారంటూ వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై టీడీపీ నేతల ఫిర్యాదుతో చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period; ఏప్రిల్‌ 15à°¨ తాడేపల్లిలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు&period; అయితే ఆయనకు రిమాండ్‌ విధించేందుకు కుప్పం మేజిస్ట్రేట్‌ నిరాకరించడంతో ఆ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్‌ చేశారు కుప్పం పోలీసులు&period; దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు&period;&period;కుప్పం మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది&period; దీనిపై సుప్రీంకోర్టులో శ్రీహరి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం&period;&period;ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది&period; ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో&period;&period; తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది&period; హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకేౖనా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరగా&period;&period; హైకోర్టులో ఇరుపక్షాలూ వాదనలు వినిపించుకోవచ్చని చెబుతూ తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.