మహిళలకు జీరో టికెట్…

Zero ticket for women

Advertisements

&NewLine;<p>రేపటి మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు&comma; మహిళలు&comma; ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది&period; ఈ నేపథ్యంలో దీనిని అమలులోకి తేనున్నారు&period; పల్లె వెలుగు&comma; ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; స్థానికత గుర్తింపు కార్డు చూపించి బస్సులో ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు&period; మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు&period; అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు&period; ప్రజా రవాణా చారిత్రాత్మక నిర్ణయమని&comma; ఈ పథకం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు&period; ఇది మహిళా సాధికారతకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు&period; కరోనా తర్వాత ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగిందని&comma; దీంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు&period; పెరుగుతున్న ప్రైవేటు వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందని&comma; ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పల్లె వెలుగు&comma; ఎక్స్‌ప్రెస్&comma; సిటీ ఆర్డినరీ&comma; మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు&period; మహిళలకు ప్రయాణం సమయంలో జీరో టిక్కెట్ ఇస్తామన్నారు&period; ఐదారు రోజుల తర్వాత జీరో టిక్కెట్ ప్రింటింగ్ చేస్తామన్నారు&period; కొన్ని రోజుల సమీక్ష అనంతరం బస్సులు పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు&period; రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్