నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.

Advertisements

<p>నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు&period; ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు&period; బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు&period; బాహుబలి&comma; కల్కి&comma; ట్రిపుల్ ఆర్&comma; అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు&period; తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్&comma; అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‍కు తీసుకు వచ్చారన్నారు&period;<br &sol;>&NewLine;నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు&period; తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం&period; నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు&period; ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని&comma; విస్తరణకు&period;&period; పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు&period; నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు&period; ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు&period; తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..