94
పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.
రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని అన్నారు. జూలై ఒకటవ తేదీన వాలంటీర్లతో ఇంటివద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక పద్ధతినే పాటిస్తుందన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమని మంత్రి డోలా అన్నారు.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.