పుస్తకావిష్కరణ వాయిదా – ఇస్రో చీఫ్

S. Somnath

Advertisements

&NewLine;<p>భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల సాధిస్తున్న విజయాలతో ఇస్రో చీఫ్ ఎస్&period;సోమనాథ్ పేరు మార్మోగుతోంది&period; అయితే&comma; ఆయన రాసిన ఓ పుస్తకం వివాదంలో చిక్కుకుంది&period; ఆ పుస్తకం పేరు &&num;8216&semi;నిలవు కుడిచ్చ సింహంగళ్&&num;8217&semi;… ఇది మలయాళ పుస్తకం&period; ఆ పేరుకు అర్థం &&num;8216&semi;వెన్నెలను తాగిన సింహాలు&&num;8217&semi;&period; సోమనాథ్ తన పుస్తకంలో ఇస్రో మాజీ చీఫ్ కె&period;శివన్ పై కొన్ని విమర్శలు చేశారంటూ తాజాగా వివాదం తలెత్తింది&period; తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి వచ్చింది&period; దీనిపై సోమనాథ్ స్పందించారు&period; తాను పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని&comma; శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు&period; సాధారణంగా స్పేస్ కమిషన్ లో సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి ఖాయమని ఓ అభిప్రాయం ఉందని&comma; కానీ&comma; ఇస్రో నుంచి మరో డైరెక్టర్ ను నియమించడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయని మాత్రమే తాను పుస్తకంలో పేర్కొన్నానని సోమనాథ్ వివరణ ఇచ్చారు&period; ఈ వివాదం కారణంగా తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు సోమనాథ్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.

చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.