ప్రసాదం ప్రాముఖ్యత

Prasadam

Advertisements

&NewLine;<p>గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది&period; అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది&period;గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు&period; వాటిని సరిగా వాడుకోగలిగితే&comma; ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి&period; వెనుకటి కాలంలో అవిద్య&comma; అనారోగ్యం&comma; దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు&period; వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు&period; కషాయాలు&comma; చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు&period; ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట&period; కష్టం&comma;సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు &OpenCurlyQuote;కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు&period; నాలుగు మంచిమాటలు చెప్పో &comma; తెలియని దేవుడి పేరు చెప్పో&comma; మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు&period; ఇక&comma; మనిషికి కావాల్సింది ఆహారం&period; దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో&comma; పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు&period; కూటికీ&comma; గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం&period;వూళ్ళల్లో వయోవృద్దులకు&comma; అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం&period; నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో&comma; దద్దోజనమో మించింది ఏముంటుంది&period;పులిహోర&comma; పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం&comma; పాయసం వీటికి మించిన భోజనం ఏముంటుంది&period; ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి&period; మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో&comma; శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు&period; పైగా మేము ప్రసాదం తినము అని అదేదో గొప్ప పని చేసినట్టుగా గొంతు పెట్టి చెప్తారు&period; అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు&comma; కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది&period; మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది&period; అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది&period; ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు&period; బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు&period; వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు&period; అదే దేముడికి ప్రసాదం చేయించండి&comma; మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు&period; అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం&period; మనం తీసుకునే పులిహోర&comma; దద్దోజనం&comma; చక్ర పొంగలి&comma; సెనగలు&comma; కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు &lpar;ఐరన్&rpar;&comma; కార్బో హైడ్రేట్లు&comma; కాల్షియం&comma; పీచు పదార్థాలు&comma; సోడియం&comma; పొటాసియం&comma; ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి&period; కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా&comma; ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..