రాయిలోనూ జీవశక్తి ఉంటుంది.

Devotion

Advertisements

&NewLine;<p>రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది&period; పదార్థాలన్నీ అణు నిర్మితాలే&period; అణువులో పరమాణువులు ఉంటాయి&period; పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి&comma; దానిలో ధనావేశిత ప్రోటాన్లు&comma; న్యూట్రాన్లు&comma; వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న సత్యం&period; నిరంతరం భ్రమించే సూక్ష్మాణువులు ఉన్నపుడు&comma; శిలలు జీవంలేనివని ఎలా అనగలం&quest; భగవంతుడు సర్వాంతర్యామిగా అందరూ అంగీకరిస్తారు&period; కాబట్టి ప్రతిమ యందూ భగవంతుడున్నట్లే&period; కాగా ఆ దైవత్వ ఉనికిని ప్రతిష్ఠా కలాపం ద్వారా మంత్ర యంత్ర తంత్ర శక్తులచే అందు పూర్ణమూ&comma; స్థిరమూ చేయడం జరుగుతుంది&period; &&num;8220&semi;మంత్రాధీనంతు దైవతం&&num;8221&semi; కాన అలానే సాధ్యం&period; నిత్యనైమిత్తిక పూజాదికంచే ఆ కేంద్రీకృత దైవశక్తి క్రమాభివృద్ధితో జనాకర్షకమై భక్తుల కోర్కెలు తీర్చుతూ వారి అజ్ఞానాంధకారం క్రమంగా తొలగిస్తూ ఉంటుంది&period; భావనాశక్తివలన స్థూలదృష్టికి కన్పడే జడ శిలనుకాక అందలి చైతన్యాన్ని దర్శింపగలం&period; ఇదంతా శాస్త్రీయ విధానమే తప్ప అశాస్త్రీయం కాదు&period; &&num;8220&semi;కష్టమ్ శాస్త్రమ్&&num;8221&semi; అన్నట్లు ఈ శాస్త్రీయత గ్రహింపగల్గడం ఒక ప్రత్యేక సంస్కారం&period; మనస్సు శుద్ధమై&comma; స్థిరమై&comma; ఏకాగ్రమై బహిర్గతంకాక తన ఉత్పత్తి స్థానమగు ఆత్మయందు విలీనమగు నిర్గుణోపాసనకు సుగుణోపాసన అత్యవసరమగు విషయం&comma; మనస్తత్వ శాస్త్ర విహితం తప్ప అనాలోచిత వ్యవహారం కాదు&period; కాబట్టి విగ్రహారాధన శాస్త్రీయ సిద్ధాంతము&comma; ఆధ్యాత్మికంలో అత్యావశ్యకము&period; ఈ సైన్సును నేటి సైంటిస్టులకంటే గొప్ప పరిశోధనల ద్వారానే ప్రాచీనకాలపు సైంటిస్టులైన మన మహర్షులు నిరూపించి తెల్పారు&period; నిశించుట&comma; విపరీత స్థితులు పొందుట లేని ఉత్తమ శిలను ప్రతిష్ఠామూర్తులకు వినియోగించుట శ్రేష్ఠం&period; అందుకే శిలా విగ్రహాలే ప్రతిష్ఠిత మవటం చూస్తాం&period; యంత్రగత మంత్రాధిష్ఠాన దేవతాశక్తిని తనలోకి స్వీకరించే గుణము శిలామూర్తికి ఉంది&period; అందుకే యంత్రముపై శిలావిగ్రహాలనే అనాదిగా ప్రతిష్ఠించడం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..