కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ స్కూల్ కు చెందిన బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో, కొండపల్లి గ్రామంలో కొంత మంది పిల్లలను దింపాల్సి ఉండటంతో రాంగ్ రూట్ లో వెళ్లారు. దీంతో ఎదురుగా వస్తున్న లారీ – బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులను కాగజ్ నగర్ కు, మరికొంతమంది విద్యార్థులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
బస్సు ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలు
79