ఉమ్మడి నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ వినియోగించారు. వీటికోసం జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ సిబ్బందికి ఆదివారం ఎన్నికల సామాగ్రి అందించి ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. మొదట 600 పోలింగ్ కేంద్రాలే ఏర్పాటు చేయాలనుకున్నా.. భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను మారుమూల ప్రాంతాల ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. వచ్చే నెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ఎన్నికల కమిషన్ మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ఆయా సంస్థలకు సూచించింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…