విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో శృంగవరపుకోట శాసనసభ్యులు పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు తమ గోడును ఎమ్మెల్యే కి విన్నవించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న నేషనల్ హైవే కోసం దగ్గరలో వున్న చెరువు గట్టును సగం తొలగించివేయడంతో తుఫాను సమయంలో ఆ చెరువు క్రింద ఉన్న పొలాలు మొత్తం సుమారు 25 ఎకరాలు నీట మునిగిపోయాయని రైతులు మొరపెట్టుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని చెప్పారు. అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క పంట నష్టానికి కారణమయిన నేషనల్ హైవేకి వ్యతిరేకంగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ స్థానిక రైతులు రోడ్ పై నిరసన తెలియజేశారు.
Read Also…
Read Also…