మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ ని విడుదల చేసారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీ పతాకలను తప్పకుండా అమలు చేస్తామని వివేక్ తెలిపారు. అందులో రెండు పథకాలను అమలు పరిచామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇచ్చిన మిగితా హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రీ డిజైన్ చేసి కోట్ల రూపాయలు వెనుకేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగానే బ్యాక్ వాటర్ తో పంట పొలాలు మునిగి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, వారికి త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికై నిర్విరామంగా కృషి చేస్తానని, తాను నియోజకవర్గంలోనే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ విడుదల…
80
previous post