మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు 500లకే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ ను వెల్లడించింది. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు. మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు. వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ అవుతుందని అధికారులు తెలిపారు.
Mahalakshmi Scheme
జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచే మహాలక్ష్మి పథకం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీం ప్రారంభించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఆరు గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. మిగతా రెండు గ్యారెంటీలు 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. ఈ రోజు నుంచి మహాలక్ష్మీ పథకం ప్రారంభించామని ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి నైతికంగా నేనే గెలిచానని అక్రమంగా సంపాదించిన డబ్బు తోటి, దొంగ ఓట్ల తోటి మాత్రమే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచాడని చెప్పారు. నైతికంగా విజయం మాదే అని చెప్పారు. కమిటీ హాల్ కు 30 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతోరద్దీ పెరిగింది. పండుగ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరో వైపు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తుండటంతో మహిళల సంఖ్య భారీగా పెరిగింది.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఓ బైకర్… ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమంజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన సంఘటన బైకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్భాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలు సహించదు. ఈ ఘటనపై ఆందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి… పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది అని ఆయన పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను 5 వందలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు ఎంతమంది, ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలనేది నిర్ణయించనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతనేది లెక్కలు తీస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారం తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అయితే, రాష్ట్రంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లు సుమారుగా 70 లక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి ‘నేమ్ ఛేంజ్’ ఆప్షన్ ఉండడంతో మిగతా వినియోగదారులు పేరు మార్చుకునే సౌలభ్యం ఉంది. ఈ క్రమంలోనే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాలలో బంధు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతని ఇవ్వాలని కోరారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంలో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం లో వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆటో కార్మికులు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ ని విడుదల చేసారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీ పతాకలను తప్పకుండా అమలు చేస్తామని వివేక్ తెలిపారు. అందులో రెండు పథకాలను అమలు పరిచామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇచ్చిన మిగితా హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రీ డిజైన్ చేసి కోట్ల రూపాయలు వెనుకేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగానే బ్యాక్ వాటర్ తో పంట పొలాలు మునిగి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, వారికి త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికై నిర్విరామంగా కృషి చేస్తానని, తాను నియోజకవర్గంలోనే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకాన్నిజిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణ టికెట్లు అందించారు. ఉచిత బస్సు ప్రయాణంతో వేలాది మంది ఆటో డ్రైవర్ల ఉపాధి గండి పడుతుందని వారికి జీవనభృతి కింద నెలకు 15వేలు ప్రభుత్వం తరుపున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది. కాలేజీలకు వెళ్లే బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు అంతా ఉచిత బస్సు సౌకర్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా తెలంగాణ లోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కలిగిందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బిఆర్ఎస్ తెలిపింది. మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా బిఆర్ఎస్ మాత్రం మహిళలకు ఎటువంటి హామీ ఇవ్వలేదు.






Total views : 141412