గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు సుమారు లక్ష పదివేల మంది రోడ్డుమీద నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తమ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు, తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాగైనా అంగన్వాడీల సమ్మెను విఫలం చేయాలని ఆలోచనతో ఈరోజు బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలో ఎస్టి కాలనీలోని తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ సెంటర్ ను బలవంతంగా సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో తదితర సిబ్బందితో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్ ను తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ సిబ్బంది అధికారులపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా తమ సెంటర్ తాళాలు పగలగొట్టి తెరవడం అన్యాయమని ఆ సెంటర్లోని వస్తువులు మా వ్యక్తిగత ఫైళ్లు ఉంటాయని వాటికి ఏమైనా నష్టం వాటిల్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు అన్నారు. బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో కోడ్ నెంబర్ 20 ఎస్టి కాలనీ అంగన్వాడీ వర్కర్ ఆయా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో దగ్గరుండి తాళాలు పగలగొట్టి సెంటర్ ను తెరిపించారు.
సమ్మె విఫలం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం….
68
previous post