పశ్చిమగోదావరిజిల్లా, తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, యూనియన్ ఆసుపత్రి ఎండీ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మీడియా ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పిన వైనం. అయన క్షమాపణ చెప్పడంతో పాటుగా అసుపత్రి వద్ద సిబ్బంది ఎవరైతే కెమెరామెన్ పై దౌర్జన్యం చేసి దుర్బాషలాడారో ప్రతీ ఒక్కరి చేతా క్షమాపణలుచెప్పించిన వైనం. అంతకు ముందు ఆసుపత్రి వద్ద వీడియో తీస్తూ ఉండగా కెమెరామెన్ వర్ధన్ ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన యూనియన్ సిబ్బంది. మూకుమ్మడిగా ఆసుపత్రి సిబ్బంది కెమెరామెన్ పై దౌర్జన్యానికి దిగడమే కాక అక్కడికి వచ్చిన కొందరు రిపోర్టర్లు పైన కూడా దురుసుగా ప్రవర్తించడంతో రేగిన వివాదం. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు పెద్ద ఎత్తున యూనియన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని వర్ధన్ కు సంఘీభావం తెలిపి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన వైనం. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, ఆర్డీవో చెన్నయ్య, డీఎం అండ్ హెచ్ వో మహేష్ తదితర జిల్లా అధికారులు దృష్టికి ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యాన్ని తీసుకువెళ్లిన మీడియా మిత్రులు. జిల్లా అధికారులు ఆదేశాలతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న మీడియా మిత్రులతో మాట్లాడిన టౌన్ ఎస్సై సురేందర్ రెడ్డి, ఇంచార్జ్ ఎమ్మార్వో శివ శంకర్ తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎపీయూ డబ్ల్యూ జే జిందాబాద్, ప్రెస్ క్లబ్ జిందాబాద్ అని నినాదాలతో హోరెత్తించి ఆందోళన కొనసాగించిన వైనం. అధికారులు సర్దిచెప్పి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందితో బహిరంగ క్షమాపణ చెప్పించడంతో సర్థుమణిగిన వివాదం. ఈ ఆందోళనలో పిలుపు ఇవ్వగానే ఆసుపత్రి వద్దకు వచ్చిన పోలీసు, రెవిన్యూ అధికారులు వారికి అదేశాలు ఇచ్చి పంపిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మీడియా మిత్రులు.
సీవీఆర్ కెమెరామెన్ పై దౌర్జన్యం…
82
previous post