ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్ లో మూడు విప్లవ కార్మిక సంఘాలు (GLBKS, TGLBKS, SGLBKS) ఈనెల 27న జరగనున్న సింగరేణి ఎన్నికలలో తమ విప్లవ కార్మిక సంఘాల గుర్తు చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ… సింగరేణి గని కార్మికుల మెడపై ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ కత్తి వేలాడుతున్నదని దీని నుండి కాపాడుకోవడానికి గని కార్మిక వర్గం, విప్లవ కార్మిక సంఘాలను బలపరుస్తూ రాజీలేని మిలిటెంట్ పోరాటాల కై సిద్ధం కావలసిన అవసరం ఉందని అన్నారు. దేశంలో బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణ, బొగ్గు గనుల వేలం, సింగరేణి ఎక్స్ప్లోరేషన్ చేసిన బ్లాక్ లను ప్రైవేటీకరించకుండా దేశవ్యాప్త సమ్మె పిలుపులు ఇవ్వకుండా, కేవలం సింగరేణి కార్మికులను భ్రమింపజేస్తూ సింగరేణిలో మాత్రం పోరాట పోజులు కొడుతూ జాతీయ సంఘాలమైన మేమే ఆపడమైన అడ్డుకోవడమైన, వేతన ఒప్పందాల నుండి ప్రతి విషయము మేము పరిష్కరించాల్సిందే అని విర్రవీగుతున్న జాతీయ కార్మిక సంఘాలు ఏరోజైనా బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఎందుకు ఇవ్వలేకపోయారో గని కార్మిక వర్గం జాతీయ సంఘాలను నిలదీయాలి. ఇక్కడ కార్మిక వర్గ పక్షం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూనే మరోవైపు కార్మిక వర్గం పై సంస్కరణల దాడి చేస్తున్న పాలక వర్గాలతో వీళ్ళ మాతృ సంస్థలు అంటకాగుతూ సింగరేణిలో వీరి కార్మిక సంఘాలు మాత్రం సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని పొజులు కొట్టడం, గని కార్మిక వర్గం గ్రహించాలని కోరుతున్నాం. సింగరేణి సంస్థ వేరే రాష్ట్రాలకు విస్తరించిందని గొప్పలు చెప్పుకుంటున్న యాజమాన్యం వారికి వంత పాడుతున్న జాతీయ కార్మిక సంఘాలు ఒడిస్సా లోని నైనీ బ్లాకులో వందల కోట్లు ఖర్చు చేసి తవ్వుతున్న మైనింగ్లో ఎంతమందిని సింగరేణి ఉద్యోగులుగా తీసుకున్నారు. సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ జైపూర్ పవర్ ప్లాంట్ లో సింగరేణి విస్తరించి ఉన్న ఈ ఆరు జిల్లాలోని ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది సింగరేణి కార్మికులు ఉన్నారో వారిని ప్రశ్నించాలని గని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐటీ రద్దు, అలవెన్స్లపై పన్నులు, రియంబర్స్మెంట్ ఏమైందని మీ ఓట్ల కోసం వచ్చే జాతీయ కార్మిక సంఘాలను నిలదీయాలని కోరుతున్నాం. నూతన భూగర్భ ఘనులు, బొగ్గుఆధారిత పరిశ్రమలు, కోల్ కారిడార్, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ ఏమైందో నిలదీయాలని గని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, 10 కోట్ల సింగరేణి నిధులు ఖర్చు చేసి శ్రీరాంపూర్ లో కెసిఆర్ తో సభ నిర్వహింపజేసిన సందర్భంగా హామీ సొంతింటి కల నెరవేర్చడానికి ఎవరు అడ్డం వచ్చారో హామీలు ఇచ్చిన అన్ని సంఘాలను నిగ్గదీసి అడగాలని కోరుతున్నాం.
కార్మికుల్ని యజమాన్యాల కింద కట్టు బానిసలను చేసే, పరిశ్రమను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలకు వంతపాడే జాతీయ కార్మిక సంఘాలను చిత్తుచిత్తుగా ఓడించాలని. సింగరేణి పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ కరణకు వ్యతిరేకంగా నూతన భూగర్భ గనుల కోసం, సింగరేణి గని కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కుల కోసం డిశంబర్ 27న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో విప్లవ కార్మిక సంఘాల కూటమి ఐన చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి బలపరచవలసిందిగా గని కార్మిక వర్గాన్ని కి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
ఈ సమావేశంలో, GLBKS, రాష్ట్ర నాయకులు, K. విశ్వనాథ్, శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, మేకల పోచ మల్లు, TGLBKS, రాష్ట్ర అధ్యక్షులు MD. చాంద్ పాషా, SGLBKS, నాయకులు, రత్న కుమార్, IFTU, రాష్ట్ర నాయకులు MD. జాఫర్,IFTU,B. కాంతయ్య, SCCWU,IFTU, రాష్ట్ర అధ్యక్షులు D. బ్రహ్మానందం, IFTU, జిల్లా నాయకులు తాళ్లపల్లి. శ్రీనివాస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా అధ్యక్షులు, V. మల్లన్న, PDSU, రాష్ట్ర నాయకులు, J. శ్రీకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు వేసే ముందు ఆలోచించండి….
59
previous post