అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పురపాలక సంఘంలో కార్మికులకు దుస్తులు, నిత్యవసరాలను పంపిణీ చేశారు.
అనంతరం పట్టణంలోని వినాయక సర్కిల్లో కేక్ కోసి వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గం కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే సతీమణి, అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు కాపు భారతి, కుమారుడు కాపు ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ పోరాల్లు శిల్ప, మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు….
133
previous post