99
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడుతున్న తమను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా దీక్ష భగ్నం చేయటం చాలా దారుణమైన చర్య అని తెలిపారు. నిరుద్యోగ యువతకు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ దీక్షకు తమ మద్దతును ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ భారత్ మాతాకీ జై, డౌన్ డౌన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేసారు. ఇదే అంశంపై బిజెపి శ్రేణులు, తమ పార్టీ నేతల చేస్తున్న దీక్షను భగ్నం చేయడంతో పోలీసులపై మండిపడ్డారు.