కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, మరికొద్ది సేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నమాణిక్యం ఠాగూర్. స్వాగతం పలికేందుకు వచ్చిన గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రుద్రరాజు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సమావేశాలు నిర్వహించడం కోసం విజయవాడ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్నాయి. అనంతరం కాంగ్రెస్ కమిటీలను పరిశీలిస్తారు. రేపు ఉదయం ఒంగోలులో జరగబోయే యువభేరి కార్యక్రమంలో హాజరవుతారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం ఏక్కువయింది. ప్రభుత్వం చేపట్టాల్సిన ఉద్యోగ రిక్రూట్మెంట్ చేపట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కు అందరూ కలసి ఎలా పనిచేయాలని చర్చిస్తాం. షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం సంతోషించదగ్గ విషయం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లో ఇద్దరు మాజీ శాసనసభ్యుల చేరిక జరుగుతుంది.
కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు హాజరుకానున్న ఠాగూర్…
76
previous post