తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో IOCL, HPCL, HP మూడు గ్యాస్ కంపెనీల లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 106 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని సైతం రద్దు చేయాలంటూ నల్ల రిబ్బన్నులతో నిరసన కోరారు. లారీ యూనియన్ డ్రైవర్ల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. డ్రైవర్లపై కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 300 మంది లారీ డ్రైవర్ కార్మికులు రోడ్డుపై బైటయించి నినాదాలు తెలియజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనను కొనసాగిస్తామన్నారు యూనియన్ సభ్యులు.