తెలుగుదేశం – జనసేన పార్టీల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం శివయ్య స్తూపం సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ కు పట్టిన కీడు తొలగాలని కోరుతూ భోగిమంటల కార్యక్రమం నిర్వహించారు. చీకటి జీవోలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎలా తగలబెట్టారో రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇలా తగలబెడతారని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఈ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఒరిజినల్ కాపీ అధికారుల దగ్గర, జిరాక్స్ కాపీలు ఓనర్ దగ్గర ఉంటాయంట ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా వాటిని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకోవాలని ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా మాట్లాడారు. మద్యం నిషేధం చేస్తానని చెప్పి, మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు, కొన్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టుపెట్టారు, ప్రైవేటు ఆస్తులు కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటే వారి ఆస్తులకి ఎక్కడ రక్షణ ఉంటుంది అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి పట్టిన కీడు తోలగాలి అంటూ భోగిమంటల కార్యక్రమం…
180
previous post