అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
జగన్ సర్కార్ పై మండిపడ్డ అంగన్వాడీలు…
70
previous post