అయోధ్య రామ మందిరం నిర్మాణం, శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో శ్రీ రామాలయం లో కాకినాడ జిల్లా బిజెపి కార్యదర్శి కాళ్ళ ధనరాజ్, నాయకులు సత్యనారాయణ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలతో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని లైవ్ లో తిలకించారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముని దేవాలయ నిర్మాణం చారిత్రక ఘట్టం అయితే ఈ రోజు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇంతటి మహోత్తర కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగటం ప్రతి హిందువు గర్వించదగిన విషయమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎన్ని అవరోధాలు ఎదురైన అయోధ్య లో రామాలయం నిర్మించడం తో దేశ ఖ్యాతి ప్రపంచ నలుదిశలా వ్యాపించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల దొరబాబు, పేదిరెడ్ల దుర్గ బాబు, సత్యనాందం, ఎన్.దొరబాబు, ఊట రాంబాబు, ఎన్.కృష్ణమూర్తి , గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాముని దేవాలయ నిర్మాణం చారిత్రక ఘట్టం…
91
previous post