84
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 35 ఎంపీ సీట్లు వస్తాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో వాక్ నిర్వహించారు. దేశంలో రాహుల్ కన్నా ప్రధాని మోడీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 100 సంవత్సరాలుగా సాధ్యంకాని పనులు మోడీ హాయాంలో జరుగుతున్నాయన్నారు. ప్రజల మూడ్‌తో సంబంధం లేకుండా రాహుల్ కార్యక్రమాలు చేపడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. విశాఖలో మూడేళ్లుగా చాలా సమస్యలు పరిష్కరించామని, స్థానిక ఎంపీ కంటే కూడా తానే ఎక్కువగా పని చేస్తున్నానని తెలిపారు.