వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రిపై కేసులు పెట్టి.. అన్న జగన్ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు. షర్మిల చేస్తున్న ద్రోహానికి స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటారని అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో నల్లపురెడ్డి పాల్గొన్నారు. జగన్ను ఓడించేందుకే వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ఇందుకు భగవంతుడు కూడా ఆమెను క్షమించడన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకు డిపాజిట్లు దక్కవని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
షర్మిల ద్రోహానికి స్వర్గంలో రాజశేఖర్రెడ్డి కంటతడి…
77
previous post