విజయనగరం జిల్లా, కొత్తవలసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి. కొత్తవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఉంటారని, వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఆదరణ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, సబ్ ప్లాన్ నిధులు, బీసీ భవనాలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ కులగణన, నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దక్కుతాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థి, విద్యార్థులకు విద్యారంగంలోనూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక ఎదుగుదల, బలహీన బడుగు వర్గాలన్నీటికి రాజకీయ పురోభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు.
కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం
99
previous post