103
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ ఆశ అనే మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. కొంతకాలం బాగానే జీవించిన నేపథ్యంలో వారికి ఒక బాబు పుట్టడం జరిగింది. ఇటీవల కాలంలో వారిరువురు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం వలన పెద్దలు సరిచేయడం జరిగిన సందర్భాలు కొనసాగాయి. అభిరామ్ అనే వ్యక్తి ఆశ అనే మహిళకు శిరోముడనం చేసి నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ బహిరంగంగానే విమర్శించడంపై స్థానికులు జరిగిన అన్యాయానికి బాధితురాలికి న్యాయం జరగాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.