పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్ చల్ చేశారు. గౌతమి నగర్ లోని ఎస్బీఐ ఏటీఎం గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే గోదావరి ఖని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎం ను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమీ నగర్ లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరి ఖని ఏసీపీ తుల శ్రీనివాస రావు, పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గౌతమినగర్ లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా కు స్ప్రే చల్లి, గ్యాస్ కట్టర్ తో మిషన్ ను కట్ చేసి చాకచక్యంగా చోరికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.