డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సై అంటే సై అంటున్నారు. ప్రైవేటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఎమ్యెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కేశవరంలో తోట త్రిమూర్తులు అక్రమంగా గ్రావెల్ తవ్వవాలు చేపట్టారని ఎమ్మెల్యే వేగుళ్ల ఆరోపించారు. ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో తేల్చుకోవడానికి గ్రామ ప్రజలతో ప్రైవేటు ఎన్నిక ఏర్పాటు చేద్దామని అన్నారు. ఎన్నికకు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని తీర్మానం చేసుకున్నారు. గ్రామంలో ప్రైవేటు ఎన్నికలో ఓడిపోయిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీల అధిష్ఠానంతో ఈ మేరకు ప్రకటన చేయించాలని అన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నిక ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని రూల్స్ రూపొందించాక మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సై అంటే సై…
109
previous post