గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన సభలో వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించారు సీఎం జగన్. 2.60 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం. పేదవాడికి సేవ చేసేందుకు.. భవిష్యత్తును మార్చేందుకు యుద్ధానికి మీరు సిద్ధమా అని వాలంటీర్లకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. 58 నెలలు నాతోపాటు మీరు ప్రజలకు సేవలు అందించారు. ఇంకో రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు పనిచేయాలి అని కోరారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో జరిగిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలను ప్రజలకు చేరవేసే యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని 17 వేల నిరుపేద కూలీల కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్న రూ.2500ను పెంచి మార్చి నుంచి రూ.5వేలు చెల్లిస్తామని ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.