శ్రీశైలం (Sri Sailam) మహాక్షేత్రం:
శ్రీశైలం మహాక్షేత్రంలో మహా అద్భుతమైన మహాకుంభాబిషేకం ఘట్టం వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మహాకుంభాబిషేకం పూజలను శాస్త్రోక్తంగా పీఠాధిపతులు నిర్వహించారు. లోకకళ్యాణం కోసం నిర్వహించే మహాకుంభాబిషేకం క్రతువులు పూజలతో హోమాలు యాగాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణంతో శ్రీశైలం క్షేత్రం మారు మ్రోగింది. మహత్తరమైన మహాకుంభాబిషేకం పూజలు నిర్వహణలో కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామిజీ, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్యులు కాశీ పీఠాధిపతి కాశిజగద్గురు మల్లికార్జునమహాస్వామీజీ పుష్పగిరి పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈనెల 16న మహాకుంభాబిషేకం పూజలను యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు ఈఓ పెద్దిరాజు ప్రారంభించారు. అయితే ఆరు రోజులపాటు ఆలయంలో జరుగుతున్న మహాకుంభాబిషేకం మహోత్సవాలు యగ్నయాగాలు ప్రత్యేక పూజలతో వైభవంగా ముగిశాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మహాకుంభాబిషేకం నిర్వహణకు శ్రీశైలం (Sri Sailam) లోని ప్రధాన ఆలయాల గోపురాలలో ఒకటైన శివాజీ గోపురం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఉపాలయాలైన పంచమఠాలు ఆయా ఉపాలయాలలో శివలింగం నందీశ్వరుల ప్రతిష్ఠ అత్యంత వైభవంగా సాగింది. మహాకుంభాబిషేకం ఆగమ శాస్త్రానుసారంగా జరిగే ఈ మహిమాన్విత కార్యక్రమంలో అర్చకులు వేదపండితులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దేవాదాయశాఖ కమీషనర్ ఆలయానికి చేరుకుని పూజలలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ పెద్దిరాజు ఆద్వర్యంలో జరిగే మహాకుంభాబిషేకం పూజలను కలష ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాకుంభాబిషేకం కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ నాలుగు గోపురాలకు విధివిధానముగా కలశాలను నెలకొల్పి ఆయా కలశాలలో దేవతా శక్తిని నిక్షిప్తం చేసి జప పారాయణ ద్యాన హోమాదులను జరిపి ఆ మంత్రపూరిత జలాలతో ఆలయంలోని గర్భాలయం విమాన గోపురాలను దేవతామూర్తులను అభిషేకించారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.