రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో 27న, జరగబోయే ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి ముఖ్య కార్యకర్తలతో సమవేశమయ్యారు. ఈ నేపధ్యంలో ముక్య కార్యకర్తలతో మాట్లాడుతూ… ఈ నెల 27న జరగబోవు సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రేపు జరగబోవు కార్యక్రమంలో రెండు గ్యారెంటీలను అనగా 500కే సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రవేశపెడుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ రెండు పథకాలను చేవెళ్ల నుంచే ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన కారణం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ గా మారిందని ఇంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేవెళ్ల నుంచి మొదలుపెట్టారని కావున చేవెళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి టిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఎప్పుడు ఈ పథకాలను ప్రవేశపెట్టకుండా నిలుపుదల చేస్తుందో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. రేపు జరగబోవు సమవేషన్ని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ యొక్క కార్యక్రమానికి సునీతా మహేందర్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీమ్ భరత్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మంత్రి సభా స్థలానికి చేరుకొని అక్కడ పనులను సమీక్షించారు అధికారులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు.
చేవెళ్ల కార్యకర్తలతో సమావేశమైన మంత్రి శ్రీధర్ బాబు…
113
previous post