రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో 27న, జరగబోయే ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి ముఖ్య కార్యకర్తలతో సమవేశమయ్యారు. ఈ నేపధ్యంలో ముక్య కార్యకర్తలతో మాట్లాడుతూ… ఈ నెల 27న జరగబోవు సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రేపు జరగబోవు కార్యక్రమంలో రెండు గ్యారెంటీలను అనగా 500కే సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రవేశపెడుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ రెండు పథకాలను చేవెళ్ల నుంచే ప్రవేశపెట్టడానికి ముఖ్యమైన కారణం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ గా మారిందని ఇంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేవెళ్ల నుంచి మొదలుపెట్టారని కావున చేవెళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి టిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఎప్పుడు ఈ పథకాలను ప్రవేశపెట్టకుండా నిలుపుదల చేస్తుందో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. రేపు జరగబోవు సమవేషన్ని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ యొక్క కార్యక్రమానికి సునీతా మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీమ్ భరత్ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మంత్రి సభా స్థలానికి చేరుకొని అక్కడ పనులను సమీక్షించారు అధికారులతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు.
Minister Sridhar Babu
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్ళారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నది. జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలపై కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయమై సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీతో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు నార్త్ బ్లాక్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏయే పద్దుల కింద ఎంత మొత్తంలో రావాలి, పెండింగ్‌లో ఉన్నవెన్ని తదితరాలను వివరించనున్నారు. దీర్ఘకాలంగా బకాయిగా ఉన్న నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలీజ్ చేసేలా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్ కింద రావాల్సిన నిధుల గురించి ఇప్పటికే పలుమార్లు వివరించగా మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున విడుదల చేయాల్సిందిగా కోరనున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.by CVR NEWSహైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.by CVR NEWSనల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..by CVR NEWSఅమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైపవర్ కమిటీతో సమావేశమై చర్చించారు. త్వరలో పలు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై అడ్వొకేట్ జనరల్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికన టీఎస్ఎస్పీ పోస్టులు కేటాయిస్తే గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. కటాఫ్ మార్కు వ్యత్యాసంతో రాజధాని ప్రాంతానికే ఎక్కువగా ఉద్యోగాలు దక్కుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే టీఎస్ఎస్పీ రాష్ట్రస్థాయి పోస్టులు కాబట్టి కటాఫ్ మార్కులు రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టీఎస్ఎస్పీ నియామకంలో జీవో నెంబర్ 46ని మినహాయించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పెద్దపెల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మంత్రి బయలుదేరారు. పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని రామగుండం, పెద్దపల్లి,ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని,ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని అన్నారు. పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే పెద్దపల్లి అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, గత పది రోజులలో అనేకసార్లు పెద్దపల్లి, సుల్తానాబాద్ కు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయాలని కోరారని, తప్పకుండా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెడతామని, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.
తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలను స్వీకరించారు.
గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్ కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్ పై గడ్డం ప్రసాద్ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు. గడ్డం ప్రసాద్ కు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.






Total views : 91177