తాడేపల్లిగూడెం జెండా సభతో రాజకీయ పార్టీల్లో అలజడి మొదలైంది. పవన్ కళ్యాణ్ సభాముఖంగా చేసిన వ్యాఖ్యలు కాకారేపాయి. ప్రధానంగా జనసైనికులతోపాటు, కాపు వర్గీయుల్లో కొందరిని పవన్ టార్గెట్ చేశారు. దీంతో ప్రతిగా లేఖలతో పెదకాపులు పవన్ పై ర్యాగింగ్ కు దిగారు. లేఖలో పవన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తనను ప్రశ్నించొద్దని అనడాన్ని కాపు పెద్దలు తీవ్రంగా ఖండించారు. దీనిపై జోగయ్య, ముద్రగడలు లేఖలు రాశారు. సభలో వైసీపీని సయితం తీవ్ర స్థాయిలో పవన్ దుయ్యబట్టారు. వ్యక్తిగతాలను సయితం తవ్వి ఆరబెట్టారు. ఇందుకు తగిన విధంగా వైసీపీ స్పందిస్తోంది. పవన్ కు మతి స్థిమితం లేకుండా పోయిందన్నారు. అంతేకాదు పవన్ అధఃపాతాళం వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్నాయి. అయితే జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్టు కన్పించినా సభ తర్వాత వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలకు ఎన్కౌంటర్లు ఇవ్వడమే కాదు కొత్తగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ వ్యక్తిగతాలను తవ్వి తీశారు. ఏది ఏమైనా ఎన్నికల వేళ జరిగే సభలు సమావేశాల్లో ఇటువంటి ఆవేశకావేశాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.
ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న పవన్ వ్యాఖ్యలు…
107
previous post