తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలు కుట్రలు పన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎంకు ఓటు వేసిన ఎవరూ ప్రధాని కాలేరని ఆయన ఎద్దేవా చేశారు. దేశం కోసం మోదీ, మోడీ కోసం మనం ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ నిర్వహించిన విజయ సంకల్పయాత్రలో భాగంగా రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధి హాజరై మాట్లాడారు. దేశంలో కుటుంబ పాలన కోసం పనిచేసే కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు ఓటు వేస్తే వచ్చేది ఏమీ లేదన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాగ్దానాలు చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయ లేదనీ అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అయిపోతుందనీ దేశ ప్రజల కోసం యువత కోసం నిత్యం ఆలోచించే దేశ ప్రధాని నరేంద్ర మోదిని మూడోసారి గెలిపిస్తేనే దేశానికి, దేశంలో ఉన్న యువత, ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను చిత్తుగా ఓడించి బిజెపికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాంనగర్ చౌరస్తాలో బీజేపీ సమావేశం…
98
previous post