తక్కళ్లపల్లి (Takkallapally) :
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి (Takkallapally)లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మూడేళ్లపాటు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ప్రేమ వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే పెగడపెల్లి మండల కేంద్రంకు చెందిన భోగ మహేష్(28) అనే యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడిపై యువతి కుటుంబ సభ్యులు ముందుగా మహేష్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ గొడవ కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో మహేష్ వెంట తెచుకున్న కత్తితో యువతి తల్లి సత్తమ్మ తో పాటు తాతపై నర్సయ్య పై దాడికి దిగాడు. అయితే, కుటుంబ సభ్యులంతా ముకుమ్మడిగా మహేష్ పై దాడి చేయడంతో అతడు అక్కడకక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మల్యాల సిఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ రహీమ్ పాషా హత్య ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి