నాగర్ కర్నూల్ (Nagar Karnool) జిల్లాలో మాతృత్వానికే మాయని మచ్చ
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తన యొక్క నెలల పసికందును మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో నాగర్ కర్నూల్ (Nagar Karnool) జిల్లా అచ్చంపేట పట్టణ నడిబొడ్డులో అంబెడ్కర్ చౌరస్తా పోస్టాఫీసు సమీపంలో వదిలి వెళ్ళిపోతుండగా గమనించిన స్థానిక చిరు వ్యాపారులు ఇదే అంశంపై పోలీసులకు సమాచారం అందించారు. లింగాల మండలం ఎర్రపెంట గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళ బల్మురి రాణి మద్యం మత్తులో నెలన్నర పాలు తాగే పసికందును అచ్చంపేట పోస్టాఫీసు ముందు వదిలేసి వెళ్తుండగా అక్కడే ఉన్న పండ్ల వ్యాపారులు స్థానికులు ఆ మహిళను ఆపి పసిబిడ్డను ఒంటరిగా అక్కడ ఎందుకు వదిలేసి వెళ్తు నావని నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లగా , మాత శిశు సంక్షేమ శాఖ అధికారి దమయంతి సంరక్షణ నిమిత్తం తల్లి తో పాటు బిడ్డ ను బాల సదన్ కు తరలించారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి