బిఎస్పి, బీఆర్ఎస్ పొత్తు ఏర్పడిన తర్వాత మొదటిసారి నాగర్ కర్నూల్ కి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారు. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారి కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని కలిసి బిఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు. అలాగే మాజీ మంత్రి బిఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా ఈ పొత్తును స్వాగతించాడని పూర్తిస్థాయిలో పార్లమెంటు స్థానానికి నిలబడే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన సరైన దిశలో తీసుకు వెళ్లడానికి బిఎస్పి జాతీయ అధ్యక్షులు మాయావతి గారు, మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు ఈ పొత్తు ఏర్పాటు చేశారని ఇది చాలా శుభసూచికమని ఆయన అన్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి తానే శుభవార్త చెప్తానని అన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలకు త్వరలోనే శుభవార్త…
135
previous post