నిన్నటి రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి గర్భాలయంలో మహాన్యాస పూర్వక అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోటబావి ప్రాంగణంలో యాదవ సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పంచవర్ణాలతో పెద్ద పట్నం వేసి స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ఆలయ పరిసరాలను స్వాగత తోరణాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పెద్దపట్నంను తొక్కడానికి చాలామంది భక్తులు ఇతర జిల్లాల నుండి కూడా విచ్చేశారు. శివరాత్రి కావడంతో శివ భక్తులు అందరూ రాత్రి జాగారం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని తలచుకున్నారు. ఉదయం మూడు గంటల ప్రాంతంలో యాదవ పూజారులు వేసిన పెద్దపట్నాన్ని తొక్కడానికి భక్తులు ఎగబడ్డారు. పోలీసులు భక్తులను అదుపు చేయడానికి చాలా ప్రయత్నించినప్పటికీ భక్తులు శివసత్తులు భారీ కేడ్లను సైతం లెక్కచేయకుండా వాటి పైనుండి దూకి పెద్ద పట్నం తొక్కి అందులోని ముగ్గును నుదుటిపై దిద్దుకొని ఇంకాస్త ముగ్గును తీసుకెళ్లి తమ పంట పొలాలలో వేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం.
ఇది చదవండి: కళ్యాణదుర్గంలో ఫ్లెక్సీల రచ్చ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి