గతంలో టీడీపీలో ఉండి వైసీపీ లోకి వెళ్లిన టీడీపీ నాయకులు (TDP Leaders) మరల తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు(YCP Leaders) పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల తెలుగు దేశం పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్, నగరపాలక కో ఆప్షన్ సభ్యుడు కోలా కిరణ్ కుమార్ నగరంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. 31 వ డివిజన్ పరిధిలోని దాదాపు 700 మందితో 250 కార్లతో రాంనగర్ కాలనీ నుంచి కొంగారెడ్డి పల్లిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ గతంలో తెలుగదేశం పార్టీ తరపున కార్పొరేటర్ గా పని చేశారని చెప్పారు. వివిధ కారణాలతో వైయస్సార్ పార్టీలో చేరారని..అనంతరం వైకాపా విధానాలు, సిద్దాంతాలు నచ్చక మళ్లీ తెలుగు దేశం పార్టీ సొంత గూటికి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్, ఉపాధ్యక్షులు కాజుర్ బాలాజీ పాల్గొన్నారు.
ఇది చదవండి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి