శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparti)లో అధికార వైసీపీని వీడి తెలుగుదేశం (TDP) పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. నల్లమాడ ఓబుల దేవర చెరువు మండలాల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి దాదాపు 300 కుటుంబాలు టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారందరికీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, టిడిపి అభ్యర్థి సింధూర రెడ్డి తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నాలుగేళ్లు వైసిపి రాతియోగ పాలన సాగిందని ప్రజలందరూ టిడిపి స్వర్ణ యుగం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నాయకుడు అధికారంలో ఉంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు మా కుటుంబం పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు మర్చిపోలేనని తెలియజేశారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి బటన్ నొక్కి పేదల బతుకులు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మళ్లీ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దోపిడి రాజ్యం కొనసాగడం ఖాయమని భావించి ప్రజలు భారీ సంఖ్యలో తెదేపా వైపు వస్తున్నారని చెప్పారు. 193 చెరువులు నీటితో నింపుతానని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి నెలరోజుల ముందు కూడా పాతపాటే పాడి ఉత్తర కుమార ప్రగల్బాలు పలికాడని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓబుల దేవర చెరువులో ఆయన మాట్లాడుతూ 193 చెరువులకు నీటితో నింపాలని డిపిఆర్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. టిడిపి అధికారంలో ఉండగా ఒకపటం చెరువుకు మూడుసార్లు హంద్రీనీవా జలాలు ఇచ్చామని మారాల రిజర్వాయర్నుఉ రెండుసార్లు నీటితో నింపామన్నారు.
2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే సాగునీటి జలాలు పంపిణీ పూర్తి చేసే వారం అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్క చెరువుకు కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నీరు నింప లేదన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తనయుడు పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలన చూశాక ప్రజలందరికీ జ్ఞానోదయమైందన్నారు. చీకట్లో ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుందని ఈ చీకటి పాలన చూశాక ప్రజలందరూ రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటపడేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చూస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అమరావతిలో టిడిపి ప్రభుత్వం కొలువు తీరుతుంది అన్నారు. 29 రాష్ట్రాల్లోనూ అగ్రగామిగా రాష్ట్రాన్ని ముందుకు నిలపగల సత్తా ఒక చంద్రబాబు నాయుడు కే ఉందని ఆయన పాలనలోనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇది చదవండి: డయేరియాతో 60 మంది స్థానికులు అస్వస్థత
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి