శ్రీశైలం మల్లన్న ఆలయానికి (Srisailam Mallanna temple)భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో శ్రీశైలం పురవీధుల్లో సందడి నెలకొంది తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి విచ్చేసారు అయితే భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు,శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి గంట సమయం పడుతుంది అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నారు.
ఇది చదవండి: ఫామ్ హౌస్ లో దొంగల బీభత్సవం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి