Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

by Satya
Kadiam Srihari joined Congress along with daughter Dr. Kavya

బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి(Kadiam Srihari).. కుమార్తె డాక్టర్ కావ్య(Daughter Dr. Kavya)తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు అధికార పార్టీలోకి వెళ్లగా, మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో సీనియర్ నేతలు అయిన కడియం శ్రీహరి, కేకే వంటి నేతలు పార్టీని వీడడం అన్నింటికంటే ఎక్కువ సంచలనమైంది.

ఇది చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు…

మరీముఖ్యంగా కడియం కావ్యను వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే, దానిని కాదనుకుని మరీ ఆమె పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం సంచలనమైంది. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసిన కావ్య.. ఫోన్‌ట్యాంపింగ్, కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు వంటివి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయని, దీనికితోడు లోక్‌సభ అభ్యర్థిని అయిన తనతో నేతలు ఎవరూ కలిసి రావడం లేదని ఆరోపించారు. కాగా, నిన్న జీహెచ్ఎంసీ మేయర్, కేకే కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …
జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల …
మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..
మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013917
Total views : 78422

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.