రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఎర్రోనిగూడ గ్రామానికి చెందిన మకుటం నర్సింలు (47) మరియు సోమయ్య(70) ఇద్దరు కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు( విరు బుచాపోల్లు). నిన్న రాత్రి కథ చెప్పడానికి వెళ్లి ఉదయం వస్తున్న క్రమంలో అల్లాడ గ్రామం దాటిన తరువాత వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే కింద పడిపోయారు వారిపై నుంచి లారీ వెళ్ళిపోయింది. లారీ కాళ్ల పై వెళ్లడంతో కాల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వెంటనే లారీ ఓనర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేసి క్షతగాత్రులను అంబులెన్స్ లో హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: ఆటో ఢీ.. కడుపులోకి రాడ్లు దూసుకెళ్ళి కూలీ దుర్మరణం..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి