చిత్ర పరిశ్రమ(film industry)లో మరో విషాదం..
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ(Sri Ramakrishna) చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai)లోని ప్రైవేట్ హాస్పిటల్(Private Hospitalలో జాయిన్ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్ రచయితగా పని చేశారు.
ఇది చదవండి:ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి నటించిన ”ఆదిపర్వం”…
ఆయన చివరిగా పని చేసిన చిత్రం ‘దర్బార్’. ఆయనకు బార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. ముంబై, జెంటిల్మన్, చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేసిన శ్రీ రామకృష్ణ బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన పార్థివ దేహానికి సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు. శ్రీరామకృష్ణ మృతిపై చిత్ర పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి