ప్రజాగళం సభలో(prajagalam meeting) వైసీపీ మూకల ఉన్మాదం
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభ జనసునామీని తలపించడంతో వైసీపీ(YCP) మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుంది. ఎన్నికల్లో గెలవడం అసాద్యమని తేలిపోవడంతో అర్థరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో టీడీపీ(TDP) కి కార్యాలయానికి నిప్పుపెట్టి రాక్షసానందం పొందారు. దాడులు, విధ్వంసంతో ప్రజాతీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజు శంకర్రావు గుర్తించాలి. త్వరలో వైసీపీని జనం బంగాళాఖాతంలో కలపబోతున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల క్రతువును నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. పోలీసులు తక్షణమే స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇది చదవండి: పెద్దిరెడ్డి కుటుంబంపై విరుచుకుపడ్డ కిరణ్ కుమార్ రెడ్డి..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి