ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా “లవ్ గురు” – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్…
Love Guru | ఘనంగా విజయ్ ఆంటోనీ “లవ్ గురు” సినిమా ప్రీ రిలీజ్
విజయ్ ఆంటోనీ(Vijay Antony) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇవాళ “లవ్ గురు” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
“లవ్ గురు”(Love Guru) సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది – రచయిత భాష్యశ్రీ
ఈ సందర్భంగా రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ – “లవ్ గురు” సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ(Mythri movie makers) వారికి థ్యాంక్స్. విజయ్ ఆంటోనీ గారు కొత్తగా కనిపిస్తారు. మృణాళిని రవి క్యారెక్టర్ చూస్తే పెళ్లాం అంటే ఇలా ఉండకూడదురా బాబు అనేలా ఉంటుంది. మా డైరెక్టర్ వినాయక్ గారు వీవీ వినాయక్ గారి అంత పేరు తెచ్చుకుంటారు. అంత బాగా మూవీని రూపొందించారు. మనిషిని కాదు మనిషి వ్యక్తిత్వాన్ని ప్రేమించాలని చెప్పే మంచి సందేశమున్న సినిమా ఇది. పాటలు యూత్ ఫుల్ గా ఉంటాయి. భరత్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. “లవ్ గురు” తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. తమిళ సినిమాలా అనిపించదు. ఈ నెల 11న రంజాన్ సందర్భంగా మీ ముందుకు వస్తున్న “లవ్ గురు” సినిమాను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ భరత్ ధనశేఖర్ మాట్లాడుతూ – “లవ్ గురు”(Love Guru) సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వినాయక్, హీరో విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. మైత్రీ మూవీ రవి గారికి, నవీన్, చెర్రీ గారికి థ్యాంక్స్. మీరు మా మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో ఎనిమిది సాంగ్ ట్రాక్స్ ఉంటాయి. మూడు పాటల్ని రిలీజ్ చేశాం. ఇంకా ఐదు పాటల్ని తెరపై చూస్తారు. ఈ పాటలన్నింటికి భాష్యశ్రీ మంచి లిరిక్స్ అందించాడు. “లవ్ గురు”(Love Guru) మా అందరికీ ఒక స్పెషల్ మూవీ. ఎన్నో మెమొరీస్ ఉన్నాయీ సినిమాతో. కొన్ని నెలలపాటు మ్యూజిక్ మీద వర్కవుట్ చేశాం. పాటల్ని మీరంతా సినిమాలో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ – తెలుగు ఆడియెన్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకే ఒక జీవితం సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసినప్పుడు హైదరాబాద్ పై ఇష్టం ఏర్పడింది. ఒక షార్ట్ ఫిలింకు డైరెక్షన్ చేసి నెక్ట్ ఏంటి అని ఆలోచిస్తున్న టైమ్ లో విజయ్ ఆంటోనీ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను చేసిన షార్ట్ ఫిలిం గురించి ఆయన మాట్లాడుతూ లవ్ గురు సినిమా గురించి చెప్పారు. ఈ మూవీకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన విజయ్ గారికి థ్యాంక్స్. ప్రేమ ద్వారా ఈ యూనివర్స్ లో ఏదైనా సాధ్యమే అనే అంశాన్ని ఈ కథలో చెబుతున్నాం. మైత్రీ మూవీ సంస్థ(Mythri movie makers)తో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్ అందరికీ ఈ సినిమాను అంకితమిస్తున్నా. మీరంతా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – “లవ్ గురు” సినిమాను రీసెంట్ గా చూశాను. చాలా బాగుంది. ప్రతి సీన్ కొత్తగా ఉంది. విజయ్ ఆంటోనీ, మృణాళిని మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. డైరెక్టర్ వినాయక్ అండ్ ఎంటైర్ టీమ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ – విజయ్ ఆంటోనీ(Vijay Antony) గారు వర్సటైల్ యాక్టర్. ఆయన బిచ్చగాడు సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ ఫేవరేట్ మూవీ. తమిళనాడుతో పాటు తెలుగులోనూ విజయ్ గారి సినిమాలను ఇష్టపడుతుంటారు. లవ్ గురు సినిమాను మేమంతా చూశాం. చాలా బాగుంది. తమిళనాడుతో పాటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ వినాయక్ గారు ఈ మూవీతో ఆకట్టుకుంటారు. మృణాళిని తెలుగులో పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కూడా ఆమెకు గుర్తింపు తీసుకొస్తుంది. లవ్ గురు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఎంగేజ్ చేస్తుంది. వీటీవీ గణేష్, యోగి బాబు నవ్విస్తారు. మీరంతా లవ్ గురు సినిమాను ఎంజాయ్ చేస్తారని, ఈ సినిమా పెద్ద రేంజ్ కు వెళ్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి మాట్లాడుతూ – లవ్ గురు(Love Guru) సినిమాను చూడగానే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. విజయ్ ఆంటోనీ గారు మైత్రీ సంస్థపై నమ్మకంతో మాకు సినిమాను చూపించి రిలీజ్ చేయిస్తున్నారు. ఆయన కెరీర్ లో ఇప్పటిదాకా ఒక తరహా సినిమాలు చూశాం. లవ్ గురు విజయ్ ఆంటోనీ గారికి సెకండ్ ఇన్నింగ్స్ అనుకునేలా ఉంటుంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ కథలో ప్రేక్షకులు ఇష్టపడే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. మ్యూజిక్ చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. వినాయక్ గారి ఫస్ట్ మూవీ అయినా ఎంతో ప్రతిభావంతంగా సబ్జెక్ట్ ను రూపొందించాడు. ఈ సమ్మర్ కు లవ్ గురు తెలుగులో మంచి హిట్ అవుతుంది. అన్నారు.
హీరోయిన్ మృణాళిని రవి మాట్లాడుతూ – లవ్ గురులో లీల క్యారెక్టర్ లో నటించాను. నా కెరీర్ లో లభించిన గొప్ప క్యారెక్టర్ ఇది. హీరోతో సమానంగా కథలో ఇంపార్టెన్స్ ఉండే రోల్ నాది. లీల క్యారెక్టర్ కు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి ఇంతమంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వినాయక్ గారికి, విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. లవ్ గురు కోసం నన్ను యాక్టింగ్ క్లాసులకు పంపించారు విజయ్ ఆంటోనీ. ఇలా మరో ప్రొడ్యూసర్ చేస్తారేమో తెలియదు. ఈ సినిమా చూశాక మీ లైఫ్ పార్టనర్స్ తో మరోసారి ప్రేమలో పడతారు. ఈ సమ్మర్ కు లవ్ గురు థియేటర్స్ లో చూడండి. అన్నారు.
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – మైత్రీ మూవీ (Mytri Movie Makers)వారితో అసోసియేట్ కావాలనేది నా డ్రీమ్. లవ్ గురుతో ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. వాళ్లు మంచి సినిమాను ఇష్టపడతారు. బిజినెస్ యాంగిల్ లోనే చూడరు. మైత్రీ సంస్థతో మరిన్ని మూవీస్ కు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా. లవ్ గురు కథ విన్నాక ఇది నా కెరీర్ లో బిచ్చగాడు తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్ కు చెప్పాను. అది నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. వినాయక్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాను హిందీలో నీ డైరెక్షన్ లోనే చేస్తాను. ఆ ప్రాజెక్ట్ కు మైత్రీ వాళ్లు కూడా కొలాబ్రేట్ అవుతారని కోరుకుంటున్నా. మృణాళిని మంచి యాక్ట్రెస్. లవ్ గురులో తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ఆమెకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పగలను. అంత బాగా యాక్ట్ చేసింది. భరత్ మ్యూజిక్ ఈ మూవీకి ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ 11న మీ ఫ్యామిలీ తో కలిసి లవ్ గురు సినిమాకు రావాలని కోరుకుంటున్నా. అన్నారు
నటీనటులు – విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
టెక్నికల్ టీమ్ :
సినిమాటోగ్రఫీ – ఫరూక్ జే బాష
సంగీతం -భరత్ ధనశేఖర్
ఎడిటింగ్, నిర్మాత – విజయ్ ఆంటోనీ
బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
సమర్పణ – మీరా విజయ్ ఆంటోనీ
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం – వినాయక్ వైద్యనాథన్.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి