సార్వత్రిక ఎన్నికల(General Elections) సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్లలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. కాగా నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,785 కోట్ల ఆస్తులు కలిగివున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల ఆస్తి, ఆయన పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
ఇది చదవండి: ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి..!
అదేవిధంగా రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాని అఫిడవిట్‌తో వెల్లడించారు. వారి వద్ద 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఇక చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి తన కుటుంబం పేరిట రూ.4,490 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్‌తో తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద రూ.1,178 కోట్లు ఆస్తులుండగా, భార్య సంగీత రెడ్డి పేరుతో రూ.3,203 కోట్లు ఉన్నాయి. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.17 కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద ప్రస్తుతం చేతిలో రూ.60 లక్షల క్యాష్, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.