దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కి నెట్టి, పరిశుభ్రమైన నగరాల్లో 3వ స్థానంలో నిలిచిన విజయవాడలో నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. విజయవాడలోని ప్రధాన కూడలి అయిన బెంజ్ సర్కిల్ వద్ద పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ సమీపంలో ఉండే ఒక వైన్ షాప్ వద్ద మందుబాబులు చేసే హల్చల్ వర్ణనాతీతం. నిత్యం వేల మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు అటుగా వెళుతుంటారు. ఈ వైన్ షాప్ వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు వేస్తూ చెత్త కుండీలు గా మార్చేశారు. నడి రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. దీంతో స్థానికులు అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యలను తీర్చాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
పరిశుభ్రమైన నగరం నేడు…. చెత్త కుండీగా మారింది
85
previous post