102
ఖమ్మం జిల్లా, వైరా గురుకుల కాలేజీ లో విద్యార్థినికి పాముకాటు పరిస్థితి విషమం. ఖమ్మం జిల్లా వైరా గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఇంటర్ విద్యార్థిని కొంగర ప్రసన్నకు డైనింగ్ హాల్ వద్ద పాము కాటు వేసింది . స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసన్న స్వస్థలం మధిర మండలం మర్లపాడు.